కన్నడిగులు అన్నగారు
- April 12, 2024
భారత చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్నారు కన్నడ కంఠీరవ డా.రాజ్ కుమార్. కోట్లాది మంది అభిమానులు "డాక్టర్. రాజ్" లేదా "అన్నావ్రు" (అన్నగారు) అని పిలిచే ఈయన కన్నడ చలనచిత్ర పరిశ్రమలో అర్థశతాబ్దం పాటు 200 పై చిలుకు సినిమాల్లో నటించారు. నేడు ఆయన వర్థంతి.
రాజ్ కుమార్ 1929, ఏప్రిల్ 24న అప్పటి మైసూరు రాజ్యంలోని గాజనూరులో కన్నడ కుటుంబంలో సింగనల్లూరు పుట్టస్వామయ్య, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు.ఈ గ్రామం ప్రస్తుతం తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ఒకటి. రాజ్ కుమార్ అసలు పేరు సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజు. తల్లిదండ్రులిద్దరూ రంగస్థల నటులు కావడంతో నటన పట్ల ఆసక్తి కలిగి నాటకాలు వేయడం మొదలు పెట్టారు.
రాజ్ కుమార్ నాటక రంగం నుండి సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి 1954లో వచ్చిన బెదర కన్నప్ప సినిమా ద్వారా పూర్తి స్థాయి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రాజ్‌కుమార్ అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు.రాజ్ కుమార్ కెరీర్ లో ఎన్నో గొప్ప సినిమాలున్నప్పటికీ, బంగారద మనుష్య (బంగారు మనిషి), కస్తూరి నివాస, గంధద గుడి, జీవన చైత్ర ఆయన కెరీర్ లో మరచిపోలేని సినిమాలు.
వెండి తెరపై రాజ్ కుమార్ నటప్రస్థానం 52 ఏళ్ళు నిరాటంకంగా సాగింది. ఈ ప్రస్థానంలో ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. నటనే జీవితంగా చివరి శ్వాస వరకు బతికిన రాజ్ కుమార్ 2006, ఏప్రిల్ 12న మరణించారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!