ఉత్తేజ్ కుమార్తె చేతన హీరోయిన్ గా తెరంగ్రేటం
- June 06, 2016
టాలీవుడ్ లో మరో వారసురాలు వెండి తెరపైన కనిపించేందుకు రెడీ అవుతోంది. కమెడియన్, రచయిత ఉత్తేజ్ కుమార్తె చేతన హీరోయిన్ గా తెరంగ్రేటం చేస్తోంది. రెండో సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. టీనేజీ లవ్ స్టోరీ 'పిచ్చిగా నచ్చావ్', హర్రర్ మూవీ 'షీ'లో నటిస్తున్నట్టు చేతన తెలిపింది. బాలనటిగా పలు సినిమాల్లో ఆమె నటించింది. 'చిత్రం' సినిమాలో కుక్కపిల్ల కావాలని సందడి చేసింది చేతనే. 'బద్రీ', భద్రాచలం సినిమాల్లోనూ బాలనటిగా చేసింది.హీరోయిన్ కావాలని ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్నని చేతన తెలిపింది. ఆమె కూచిపూడి కూడా నేర్చుకుంది. 'నటిని కావాలనుకుంటున్నానని ఇంటర్మీడియట్ లో నాన్నను చెప్పా.
ఆయన నో అని చెప్పలేదు కానీ ఇండస్ట్రీలో రాణించాలంటే కష్టపడి పనిచేయాల్సి ఉంటుంద'ని చెప్పినట్టు వెల్లడించింది. టాలీవుడ్ లో వారసురాళ్ల తెరగ్రేటం క్రమంగా పెరుగుతోంది. చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా నటించింది. హీరో రాజశేఖర్ కుమార్తె శివాని కూడా వెండితెరపై కనిపించనుందని ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







