సినీనటుడు విశాల్‌కు పీఎఫ్‌సీఐ పురస్కారం

- June 06, 2016 , by Maagulf
సినీనటుడు విశాల్‌కు పీఎఫ్‌సీఐ పురస్కారం

సినీనటుడు విశాల్‌కు పీఎఫ్‌సీఐ పురస్కారాన్ని తమిళనాడు గవర్నర్ రోశయ్య అందజేశారు. విశాల్‌తో పాటు మరికొంతమంది సినీ తారలకు పురస్కారను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూపురాతన కాలం నుంచి భారతీయ సమాజంలో మనుషులతో సహా జంతువులకు, పక్షులకు సమాన ప్రాధాన్యం ఉందని, అయితే నేటి సమాజంలో మూగజీవాలపై హింస పెరుగుతుండడం ఆందోళనకరమైన అంశమని అన్నారు. మూగజీవాలపై హింసను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పీపుల్‌ ఫర్‌ కాటిల్‌ ఇన్ ఇండియా (పీఎఫ్‌సీఐ) సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పశువుల సంరక్షణ కోసం కృషి చేస్తున్న పలువురిని ఆదివారం సత్కరించింది.హీరోయిన్ వరలక్ష్మి, సామాజికవేత్తలు సూర్య, నిషాసింగ్‌ తదితరులు ఈ పురస్కారాలను అందుకున్నారు. గత పదేళ్లుగా ప్రతి రోజూ 100 వీధి కుక్కలకు ఆహారం అందిస్తున్నందుకు ఉత్తమ జంతు సంరక్షకురాలు బిరుదును నిషాసింగ్‌ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ, మన దేశంలో మనుషులకు, జంతువులకు మధ్య అవినాభావ సంబంధం ఉందని, భారతీయ సమాజంలో జంతువులు అంతర్భాగమని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి కీలకమైన వ్యవసాయరంగంలో పశువులు ఎంతో ప్రయోజనకర సేవలందిస్తున్నాయని, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనదేనని అన్నారు. ఇటువంటి మూగజీవాలపై హింసను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్‌ పిలుపునిస్తూ... పశువుల సంరక్షణ కోసం విశేష కృషి చేస్తున్న పీఎఫ్‌సీఐ వ్యవస్థాపక సభ్యులు జి.అరుణ్‌ ప్రసన్నను అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com