ఎమోషనల్​గా ‘శ్రీకాంత్‌ బొల్లా’ బయోపిక్ ట్రైల‌ర్..

- April 13, 2024 , by Maagulf
ఎమోషనల్​గా ‘శ్రీకాంత్‌ బొల్లా’ బయోపిక్ ట్రైల‌ర్..

హైదరాబాద్: బాలీవుడ్ న‌టుడు రాజ్ కుమార్ రావు హీరోగా న‌టిస్తున్న తాజా బ‌యోపిక్ శ్రీకాంత్. కృష్ణా జిల్లా మచిలీపట్నం శివార్లోని సీతారాంపురం గ్రామంకు చెందిన ప్రముఖ అంధ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ అధినేత శ్రీకాంత్‌ బొల్లా జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా రానుండ‌గా.. తుషార్ హీరానందానీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. జ్యోతిక, శ‌రద్ కేల్క‌ర్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన చిత్ర‌బృందం ఉగాది పండుగ కానుక‌గా ట్రైల‌ర్ విడుద‌ల చేసింది.

ఇక ఈ ట్రైల‌ర్ గ‌మ‌నిస్తే.. కృష్ణా జిల్లా మచిలీపట్నం శివార్లోని సీతారాంపురం గ్రామంలో దృష్టి లోపంతో జన్మించిన శ్రీకాంత్ ఆ త‌ర్వాత ఎటువంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాడు. త‌న చ‌దువు అనంత‌రం అన్నింటిని దీటుగా ఎదుర్కొని పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడు. చివరికి హైదరాబాద్‌లో బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను ఎలా స్థాపించాడు. అనే స్టోరీతో ఈ సినిమా రానుంది. ఇక ఈ ట్రైల‌ర్‌లో రాజ్ కుమార్ రావు శ్రీకాంత్ పాత్ర‌లో జీవించాడు అని తెలుస్తుంది. టీ సీరిస్‌, ఛాక్‌ అండ్‌ ఛీస్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, నిధి పర్మార్‌ హీరానందానీ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. 2024 మే 10న ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రం రానుంది.

శ్రీకాంత్‌ బొల్లా గురించి...

కృష్ణా జిల్లా మచిలీపట్నం శివార్లోని సీతారాంపురం గ్రామంలో 1992, జులై 7న జన్మించాడు.  వ్యవసాయ కుటుంబానికి చెందిన శ్రీకాంత్ పుట్టుకతోనే అంధుడు. శ్రీకాంత్ పుట్టిన తర్వాత కుటుంబ సభ్యులతో కొంతమంది బంధువుల, స్థానికులు ఈ బాబుతో ముందు ముందు కష్టాలు ఉంటాయి.. వదిలించుకోవడం మంచిదని సలహా ఇచ్చారట. కానీ శ్రీకాంత్ తల్లిదండ్రులు ఆవేవీ పట్టించుకోకుండా తమ కొడుకు కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. కంటి చూపు లేకున్నా.. తన లోపాన్ని ఛాలెంజ్ గా తీసుకొని శ్రీకాంత్ బొల్లా పట్టుదలతో ఉన్నతవిద్యనభ్యసించి అమెరికాలోని ఎంఐటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన తొలి అంతర్జాతీయ అంద విద్యార్థిగా రికార్డు క్రియేట్ చేశాడు. చిన్నప్పటి నుంచి చదువుల్లో ఎంతో చురుకుగా ఉండేవాడు శ్రీకాంత్. టెన్త్ లో మంచి మార్కులు సాధించిన తర్వాత ఇంటర్లో సైన్స్ సబ్జెక్ట్ తీసుకోవాలని భావించాడు.  కానీ కానీ కొన్ని రూల్స్ వర్తించవని సైన్స్ సబ్జెక్ట్ కి సంబంధించి అడ్మీషన్ లభించలేదు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించిన శ్రీకాంత్ తర్వాత సైన్స్ సబ్జెక్ట్ చదివేందుకు కోర్టు నుంచి అనుమతి పొందాడు.

తాను ఎంతో ఆశంతో కాలేజ్ లో చేరితే.. అక్కడ విద్యార్థుల అవహేళన భరించలేకపోయాడు. దీంతో రెండేళ్ల పాటు ఇంటికే పరిమితం అయ్యాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఓ దివ్యాంగుల స్కూల్ లో చేరాడు. అక్కడ కూడా అవమానాలు ఎదురయ్యాయి.. దీంతో ఇంటికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఓ టీచర్ అతన్ని ఆపి ధైర్యం చెప్పాడు. ఆడియో టేపుల్లో పాఠాలు విని ఎంపీసీలో 98 శాతం మార్క్ లతో టాపర్ గా నిలిచాడు. ఆ తర్వాత ఐఐటీ చదవాలనుకున్న అంధుడు కావడంతో మళ్లీ అదే సమస్య ఎదురైంది. ప్రస్తుతం శ్రీకాంత్ బొల్లా పారిశ్రామిక వేత్తగా సక్సెస్ ఫుల్ గా లైఫ్ గడుపుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో 2012 లో బొల్లాంట్ ఇండస్ట్రీస్ అనే సంస్థను స్థాపించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ఈ సంస్థకు రతన్ టాటా కూడా ఫండింగ్ చేసి ఆదుకున్నాడు. ఇది మొక్కల ఆధారంగా కంపెనీ ప్రొడెక్ట్స్ తయారు చేసే కంపెనీ.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com