ఇక ఆ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టాల్సిందే.!
- April 13, 2024
‘జగదేవక వీరుడు అతిలోక సుందరి’ సినిమా అప్పట్లో ఓ అద్భుతమైన దృశ్య కావ్యం. ఆ సినిమాకి చాలా సార్లు సీక్వెల్ రూపొందించాలని అనుకున్నారు నిర్మాత అశ్వనీ దత్. కానీ కుదరలేదు.
సెకండ్ జనరేషన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ అతిలోక సుందరి జాన్వీ కపూర్ వచ్చాకా కూడా ఈ ప్రాజెక్ట్‌పై కసరత్తులు జరిగాయ్ కానీ, అదీ కుదరలేదు.
ఇక, ఇప్పుడు.. ఆ సమయం రానే వచ్చిందనిపిస్తోంది. ఎట్టకేలకు ఈ క్రేజీ కాంబినేషన్ అయితే సెట్టయ్యింది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రామ్ చరణ్, జాన్వీ కపూర్ జత కడుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్లోనే ఈ ప్రాజెక్ట్ గురించి రామ్ చరణ్ నోటి వెంట ఈ ప్రాజెక్ట్ చర్చకొచ్చింది. తాజాగా మరోసారి మెగాస్టార్ చిరంజీవి తన మనసులోని మాట బయట పెట్టారు.
రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్లో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చూడాలన్నది తన డ్రీమ్ అని ఆయన అన్నారు. ఇంకేముంది.! అందరికీ ఆ కోరిక వుంది. సో, విజయేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖులు ఈ సీక్వెల్‌కి స్ర్కిప్ట్ సిద్దం చేయడమే తరువాయి.!
తాజా వార్తలు
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!