ఎన్టీయార్ - హృతిక్ ‘వార్’ మామూలుగా వుండదు.!
- April 13, 2024
బాలీవుడ్ చిత్రం ‘వార్ 2’లో ఎన్టీయార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్టీయార్ విలన్ అవతారమెత్తబోతున్నారు. ఆ పాత్ర కోసం ఎన్టీయార్ గెటప్ చాలా ప్రత్యేకంగా వుండబోతోందట.
కాగా, తాజాగా సెట్స్‌లోకి అడుగు పెట్టిన ఎన్టీయార్ ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాల్లో భాగం పంచుకోబోతున్నారట. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి పాటలు, ఫైట్స్ ప్రాణం.
పాటల విషయానికి వస్తే, ఇటు ఎన్టీయార్, అటు హృతిక్ రోషన్ ఇద్దరూ మంచి డాన్సర్లే. సో, ఇద్దరి మధ్యా ఓ కాంబినేషన్ సాంగ్ చిత్రీకరించబోతున్నారట. భీభత్సమైన డాన్స్ స్టెప్పులతో న భూతో న భవిష్యతి అనేలా ఈ పాట చిత్రీకరణ వుండబోతోందట.
అలాగే, యాక్షన్ ఘట్టాలు కూడా ఒళ్లు గగుర్పొడిచేలా వుండబోతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా తాజా షెడ్యూల్‌లో చిత్రీకరించబోయే సాంగ్, ఓ యాక్షన్ బ్లాక్ సినిమాకి హైలైట్ కానుందట. నువ్వా.? నేనా.? అన్న చందంగా ఎన్టీయార్, హృతిక్ రోషన్ తలపడబోతున్నారట.
తాజా వార్తలు
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ