ఎన్టీయార్ - హృతిక్ ‘వార్’ మామూలుగా వుండదు.!
- April 13, 2024బాలీవుడ్ చిత్రం ‘వార్ 2’లో ఎన్టీయార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్టీయార్ విలన్ అవతారమెత్తబోతున్నారు. ఆ పాత్ర కోసం ఎన్టీయార్ గెటప్ చాలా ప్రత్యేకంగా వుండబోతోందట.
కాగా, తాజాగా సెట్స్‌లోకి అడుగు పెట్టిన ఎన్టీయార్ ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాల్లో భాగం పంచుకోబోతున్నారట. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి పాటలు, ఫైట్స్ ప్రాణం.
పాటల విషయానికి వస్తే, ఇటు ఎన్టీయార్, అటు హృతిక్ రోషన్ ఇద్దరూ మంచి డాన్సర్లే. సో, ఇద్దరి మధ్యా ఓ కాంబినేషన్ సాంగ్ చిత్రీకరించబోతున్నారట. భీభత్సమైన డాన్స్ స్టెప్పులతో న భూతో న భవిష్యతి అనేలా ఈ పాట చిత్రీకరణ వుండబోతోందట.
అలాగే, యాక్షన్ ఘట్టాలు కూడా ఒళ్లు గగుర్పొడిచేలా వుండబోతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా తాజా షెడ్యూల్లో చిత్రీకరించబోయే సాంగ్, ఓ యాక్షన్ బ్లాక్ సినిమాకి హైలైట్ కానుందట. నువ్వా.? నేనా.? అన్న చందంగా ఎన్టీయార్, హృతిక్ రోషన్ తలపడబోతున్నారట.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు