‘కన్నప్ప’లో స్వీటీ.? నిజమేనా.?
- April 13, 2024
మంచు ఫ్యామిలీ మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. మంచు ఫ్యామిలీ తరపున ఓ సంచలనాత్మక చిత్రం.. అందులోనూ ప్యాన్ ఇండియా చిత్రం వుండాలన్న కసితో సీనియర్ నటుడు పెద్దాయన మోహన్ బాబు ఈ సినిమాకి శ్రీకారం చుట్టారు.
అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో సౌత్, నార్త్ నుంచి పలు భాషా ప్రముఖ నటీనటుల్ని భాగం చేస్తున్నారు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ తదితరులు, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, తమిళ పరిశ్రమ నుంచి మోహన్ లాల్.. ఇలా పలువురు నటీనటుల్ని భాగం చేశారు.
తెలుగులో ప్రబాస్, నాగార్జున, ఎన్టీయార్ తదితర స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయ్. లేటెస్ట్‌గా స్వీటీ అనుష్క పేరు కూడా ప్రముఖంగా తెరపైకి వచ్చింది.
ప్రబాస్ పక్కన జోడీగా మొదట నయనతారను అనుకున్నారు ఈ సినిమా కోసం. ప్రబాస్ పోషించబోయే శివుడి పాత్రకు కాంబినేషన్‌గా పార్వతిగా నయన తార కనిపించబోతోందని అన్నారు. కానీ, ఆ పాత్రలో అనుష్క పేరు వచ్చి చేరింది. అంటే, పార్వతిగా అనుష్క కనిపించబోతోందన్నది ఈ ప్రచారం తాలూకు సారాంశం. ఒకవేళ అదే నిజమైతే, ఈ కాంబినేషన్ హిట్టు కాంబినేషన్ కాబట్టి.. సినిమాకి అది ఓ అస్సెట్ అయ్యే అవకాశం లేకపోలేదో.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







