ఫైనల్లీ.. ‘ఇండియన్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.!
- April 13, 2024
దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత సీక్వెల్‌గా రూపొందుతోన్న సినిమా ‘ఇండియన్ 2’. సేనాపతి పాత్రలో లోక నాయకుడు కమల్ హాసన్ పోషించిన ఆ పాత్ర అప్పట్లో ఓ సెన్సేషన్.
అదే పాత్రను తాజా సీక్వెల్లోనూ కంటిన్యూ చేస్తున్నారు. రీసెంట్గా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్లో కమల్ హాసన్ పంచె కట్టులో చేతులు వెనక్కి కట్టుకుని నిలబడ్డారు. అవినీతిపరులపై సేనాపతి అను ఓ స్వాతంత్ర్య సమరయోధుడు చేసిన పోరాటమే ఈ సినిమా.
దర్శకుడు శంకర్ తనదైన శైలిలో రూపొందించారు. ఎన్నో అవాంతరాలు తట్టుకుని ఎట్టకేలకు సినిమా షూటింగ్ పూర్తి చేశారు. లేటెస్ట్గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఈ పోస్టర్ వదిలారు.
జూన్ 2న ‘ఇండియన్ 2’ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందింది.
ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..