ఉమ్మెత్త ఆకులతో ఇన్ని లాభాలా.?

- April 13, 2024 , by Maagulf
ఉమ్మెత్త ఆకులతో ఇన్ని లాభాలా.?

ఎక్కడో ఇంటికి దూరంగా పెంటపై పెరిగే ఉమ్మెత్త చెట్టులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటే నమ్ముతారా.? నిజంగా నిజం. ఉమ్మెత్త పువ్వు చూసేందుకు చాలా అందంగా వుంటుంది.

అంతేకాదండోయ్. గణపతికి, శివుడికి ఈ పువ్వుల్ని, వీటి కాయల్ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు. కానీ ఇంటి పరిసరాల్లో ఈ చెట్లను ఎక్కువగా పెరగనివ్వరు.

కానీ, ఈ చెట్టు ఉపయోగాలు తెలిస్తే.. పరిసరాల్లో కాదు, ఇంట్లోనే కుండీల్లో చక్కగా పెంచుకుంటారు. పెంచాల్సిన ఆవశ్యకత కూడా వుంది. ఇంతకీ ఉమ్మెత్తతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలేంటీ.?

కీళ్ల నొప్పులు, వాపులు వున్నచోట ఉమ్మెత్త ఆకుల్ని నువ్వుల నూనెతో కలిపి వేడి చేసి నొప్పి వున్న చోట కట్టులా వేస్తే నొప్పి సులువుగా లాగేస్తుంది.

అంతేకాదు, తీవ్రమైన సమస్యగా పరిగణించే మైగ్రేన్ తలనొప్పికి కూడా ఇది మంచి ఔషధం. పైన చెప్పిన విధంగానే ఆకులతో పట్టు వేస్తే మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందొచ్చు.

అంతేకాదు, ఉమ్మెత్త ఆకుల్ని మెత్తని పేస్ట్‌లా నూరి కొబ్బరి నూనెతో కలిపి తలకు పట్టిస్తే.. తలలో చుండ్రు మాయమైపోవడమే కాదు, పేలు వంటివి కూడా తగ్గిపోతాయ్.

దురదలు, గజ్జి, తామర వంటి అంటు వ్యాధులకు సైతం ఉమ్మెత్త ఆకులతో వైద్యం శ్రేయస్కరం. ఇన్ని ఉపయోగాలున్న ఉమ్మెత్త చెట్టును ఖచ్చితంగా ఇంట్లో పెంచాల్సిందేగా మరి.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com