ఫైనల్లీ.. ‘ఇండియన్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.!

- April 13, 2024 , by Maagulf
ఫైనల్లీ.. ‘ఇండియన్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.!

దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత సీక్వెల్‌గా రూపొందుతోన్న సినిమా ‘ఇండియన్ 2’.  సేనాపతి పాత్రలో లోక నాయకుడు కమల్ హాసన్ పోషించిన ఆ పాత్ర అప్పట్లో ఓ సెన్సేషన్.

అదే పాత్రను తాజా సీక్వెల్‌లోనూ కంటిన్యూ చేస్తున్నారు. రీసెంట్‌గా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

ఈ పోస్టర్‌లో కమల్ హాసన్ పంచె కట్టులో చేతులు వెనక్కి కట్టుకుని నిలబడ్డారు. అవినీతిపరులపై సేనాపతి అను ఓ స్వాతంత్ర్య సమరయోధుడు చేసిన పోరాటమే ఈ సినిమా.

దర్శకుడు శంకర్ తనదైన శైలిలో రూపొందించారు. ఎన్నో అవాంతరాలు తట్టుకుని ఎట్టకేలకు సినిమా షూటింగ్ పూర్తి చేశారు. లేటెస్ట్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఈ పోస్టర్ వదిలారు.

జూన్ 2న ‘ఇండియన్ 2’ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందింది. 

ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com