ఆర్టీసీ కళాభవన్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

- April 14, 2024 , by Maagulf
ఆర్టీసీ కళాభవన్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లోని కళా భవన్ లో ఆదివారం ఘనంగా జరిగాయి. 

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి అధికారులు, సిబ్బంది పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను వారు స్మరించుకున్నారు.

భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ గమనాన్ని మార్చడంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పోషించిన పాత్ర ఎనలేనిదని  వారు కొనియాడారు.బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన మహనీయుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన వ్యక్తి అంబేడ్కర్ అని, ఆయన ఆశయాలు తరతరాలకు స్పూర్తి అని కీర్తించారు.

అంబేద్కర్ సామాన్య కుటుంబంలో జన్మించి అసమాన్య వ్యక్తిగా ఎదిగారని పపంచ వ్యప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించడం గొప్ప విషయమన్నారు. 

అట్టడుగు స్థాయి వారి శ్రేయస్సును కాంక్షించి వారి జీవితాలు బాగుండాలని అంబేద్కర్ పరితపించారని కొనియాడారు.అంబేద్కర్ మహనీయుడి ఆలోచనా విధానం మార్గదర్శకమంటూ అధికారులు శ్లాఘించారు.

ఈ కార్యక్రమంలో ఎగ్జికూటివ్ డైరెక్టర్లు కృష్ణకాంత్,ముని శేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, ఎఫ్ఏ విజయ పుష్ప తో పాటు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘ నాయకులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

బస్ భవన్ లోనూ అంబేద్కర్ జయంతి వేడుకలు

అంతకు ముందు బస్ భవన్ లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్ని నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి ఉన్నతాధికారులు, సిబ్బంది పూల మాలలు వేసి నివాళులర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com