ఎయిర్ లైన్స్‌లో ఇఫ్తార్ బాక్స్‌లు
- June 06, 2016
ఖతార్ ఎయిర్ వేస్, ప్రతిసారి లాగానే ఈసారి కూడా తాము నడుపుతున్న విమానాల్లో ప్రయాణీకులకు ఇఫ్తార్ బాక్సుల్ని అందించనున్నట్లు వెల్లడించింది. రమదాన్ సందర్భంగా ప్రయాణీకులు తమ ఉపవాసాన్ని విరమించే సమయంలో ఆహారం తీసుకోడానికి వీలుగా ఈ ఇఫ్తార్ బాక్స్‌లకు రూపకల్పన చేశారు. రమదాన్ ప్రాశస్త్యాన్ని చెబుతూ, పోషక విలువలో కూడిన ఆహారాన్ని ఇఫ్తార్ బాక్స్‌లో పొందు పర్చుతున్నామని ఖతార్ ఎయిర్ వేస్ వర్గాలు వివరించాయి. కైరో, అబుదాబీ, బహ్రెయిన్, బస్రా, దమ్మామ్, దుబాయ్, గస్సిమ్, కువైట్ మస్కట్, రియాద్, షార్జా, అభా, అలెగ్జాండ్రియా, అమ్మన్, బాగ్దాద్, ఖర్తౌమ్, మెదినా, నజాఫ్, సలాలా, సులేమానియా, తైఫ్, హోఫుఫ్, షిరాజ్, లగ్జర్ మరియు మషాద్ల మధ్య నడిచే విమానాల్లో ఇఫ్తార్ బాక్స్‌లు అందుబాటులో ఉంటాయి. ఖతార్ ఎయిర్ వేస్ బిజినెస్ మరియు ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించేవారికి వెజిటబుల్ క్రడిట్స్, హమ్మస్, చికెన్ విత్ టారాటోర్ సాస్, శాండ్విచ్ మరియు మోజారెలా ఛీజ్, టమాటా చట్నీ శాండ్విచ్, బనానా, అసార్టెడ్ నట్, డేట్స్, బక్లవా, లబాన్, అల్పెన్ బార్, రిఫ్రెషింగ్ టవల్ మరియు వాటర్ బాటిల్‌ను అందజేస్తారు. ఎకానమీ క్లాస్ ఇఫ్తార్ బాక్సుల్లో మెజెరెల్లా చీజ్, స్పైసీ టమాటా చట్నీ శాండ్విచ్చ, మమౌల్, అసార్టెడ్ నట్స్, డేట్స్, లబాన్, బిస్కట్స్, రిఫ్రెషింగ్ టవల్ మరియు వాటర్ బాటిల్‌ని ఇస్తారు. ఖతార్ ఎయిర్ వేస్ క్యాబిన్ సిబ్బంది, ఆన్‌బోర్డ్ అనౌన్స్మెంట్ చేసి, ఇఫ్తార్ బాక్సులను సరైన సమయంలో సెర్వ్ చేస్తారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









