బెంగళూరు పై హైదరాబాద్ ఘన విజయం

- April 16, 2024 , by Maagulf
బెంగళూరు పై హైదరాబాద్ ఘన విజయం

బెంగళూరు: బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. బెంగళూరుపై ఘన విజయం సాధించింది. 25 పరుగుల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. 288 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన 262 పరుగులే చేసింది. దినేశ్ కార్తిక్ చెలరేగిపోయాడు. సిక్సుల వర్షం కురిపించాడు. హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. 35 బంతుల్లోనే 83 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్ లో 7 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. 287 పరుగుతో ఐపీఎల్ చరిత్రలో రికార్డ్ సృష్టించింది.

బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సిక్సుల వర్షం కురిపించారు. 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 287 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. ఈ సీజన్ లో ముంబైపై ఎస్ఆర్ హెచ్ 277 రన్స్ చేసి చరిత్ర సృష్టించగా.. ఆ రికార్డును కొద్ది రోజుల్లోనే బద్దలు కొట్టింది కమిన్స్ సేన. హెడ్, క్లాసెన్ వీర విహారంతో హైదరాబాద్ భారీ స్కోర్ నమోదు చేసింది. హెడ్ సెంచరీతో చెలరేగాడు. 41 బంతుల్లో 102 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 8 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. క్లాసెన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 31 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి.

హైదరాబాద్ రికార్డులు..

  • ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్
  • ఒక ఐపీఎల్ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు (22)
  • ఒక సీజన్ లో రెండు సార్లు 250+ స్కోర్ చేసిన తొలి జట్టు
  • ఐపీఎల్ చరిత్రలో 2సార్లు 270+ స్కోర్ చేసిన తొలి జట్టు
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com