పేదలకు సాయంపై క్యాంపెయిన్‌

- June 06, 2016 , by Maagulf
పేదలకు సాయంపై క్యాంపెయిన్‌

పవిత్ర రమదాన్ సందర్భంగా పేదవారిని ఆదుకునేందుకోసం చైతన్యం పెంచే కార్యక్రమాలను చేపడుతున్నారు. 'ది ట్రీ ఆఫ్‌ గాడ్‌ డీడ్స్‌' ప్రోగ్రామ్‌ ద్వారా సేవా కార్యక్రమాలపై అవగాహన పెంచనున్నారు. షేక్‌ రషీద్‌ బిన్‌ హమదాన్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమిరేట్స్‌ రెడ్‌ క్రిసెంట్‌, నహతామ్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ, గ్రేస్‌ కన్వర్జేషన్స్‌, ఖాలిదియా మాల్‌ వంటి సంస్థలు ఇందులో భాగం పంచుకుంటున్నాయి. ట్రీ ఆఫ్‌ లైఫ్‌ అనే కాన్సెప్ట్‌లో భాగంగా, ఒక్కొక్కరూ ఒక్కో ఆకుని 10 దిర్హామ్‌లకు కొనుగోలు చేసి, చెట్టుకి అతికించడం ద్వారా జీవం లేని చెట్టుకి జీవం పోసినట్లవుతుందనే గొప్ప విషయాన్ని నిరూపించనున్నారు. పేదలకు సహాయం చేసేందుకు ఇలాంటి ఇన్నోవేటివ్‌ థాట్స్‌తో ఎవరైనా ముందుకు వస్తే, వారికి విశేష ప్రాచుర్యం కల్పిస్తామని, సమాజానికి వారు సేవ చేసినట్లవుతుందని నిర్వాహకులు తెలిపారు. పవిత్ర రమదాన్ మాసంలో ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com