ఒమానీ గవర్నరేట్‌లలో కొనసాగుతున్న వర్షాలు..!
- April 16, 2024
మస్కట్: విశ్లేషణ ఒమన్ సుల్తానేట్‌లో అస్థిర వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని నేషనల్ మల్టీ-హాజార్డ్స్ ఎర్లీ వార్నింగ్ సెంటర్ (సివిల్ ఏవియేషన్ అథారిటీ) వెల్లడించింది. ఏప్రిల్ 16న అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని సివిల్ ఏవియేషన్ అథారిటీలోని వాతావరణ శాస్త్రవేత్త ఐషా జుమా అల్ ఖాస్మీ తెలిపారు. ముసందమ్, అ'దహిరా, అల్ బురైమి, నార్త్ అల్ బతినా మరియు అ'దఖిలియా గవర్నరేట్‌లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దక్షిణ అల్ బతినా, మస్కట్ మరియు అల్ వుస్తా గవర్నరేట్‌లోని కొన్ని గవర్నరేట్‌లలో వరదలు తలత్తే అవకాశం ఉందని తెలిపారు. అ'దఖిలియా, నార్త్ ఎ'షర్కియా మరియు సౌత్ ఎ'షర్కియా గవర్నరేట్‌లలో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాస్త్రవేత్త స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.
తాజా వార్తలు
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్‌లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్‌గ్రౌండ్‌లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం