తెలంగాణ: ఇంటి యజమానులకు బల్దియా బంపరాఫర్
- April 16, 2024
హైదరాబాద్: హైదరాబాద్ లో మీకు సొంత ఇల్లు, ప్లాట్, ఫ్లాట్ ఏదైనా ఉందా.. ఐతే.. మీకే ఈ వార్త. హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక అందించారు నగర పాలక సంస్థ అధికారులు. ఎర్లీబర్క్ స్కీమ్ బల్దియా అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును చెల్లించడానికి ఎర్లీబర్డ్ పథకాన్ని వినియోగించుకొని 5 శాతం రాయితీ పొందాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సూచించారు. ఈ నెల 30వ తేదీలోపు ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలని తెలిపారు. ప్రతీ ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా.. రాయితీని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ దృష్టి సారించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను చెల్లింపునకు సంబంధించి ఎర్లీబర్డ్ పథకాన్ని ఆమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ.230 కోట్ల ఆదాయం సమకూరిందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలన్నారు. ఈ పథకం ద్వారా రూ.800 కోట్ల పన్నులు వసూలు చేయాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..