ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ మరో క్రూరమైన చర్య
- June 06, 2016
ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ మరో క్రూరమైన చర్యకు పాల్పడింది. లైంగిక కోరిక తీర్చని 19 మంది బాలికలను దారుణంగా చంపేసింది. ఇరాక్లోని ఐఎస్ ఆధీనంలోని మోసోల్లో ఈ ఘటన జరిగింది. తమను సుఖపెట్టని బాలికలను ఉగ్రవాదులు ఇనుప జాలీలో బంధించారు.
అందరూ చూస్తుండగా నిప్పంటించి వారిని సజీవ దహనం చేశారు. భయంతో ఏ ఒక్కరు కూడా వారిని కాపాడలేకపోయినట్లు కుర్దీష్కు చెందిన వార్తా సంస్థ తెలిపింది. వందలాది మంది చూస్తుండగానే ఆ దారుణానికి పాల్పడ్డారని, వారిని రక్షించేందుకు ఎవరూ ముందుకు వచ్చే సాహసం చేయలేదని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.
ఇరాక్లోని యాజ్దీ ప్రాంతాన్ని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు 2014లో ఆక్రమించుకున్నారు. అప్పటి నుంచి అక్కడి ప్రజల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. సెక్స్ బానిసలుగా మారడానికి అంగీకరించని యాజ్జీ యువతులను గతంలో కూడా దారుణంగా కొట్టి చంపారు.
క్రైస్తవం, జోరాస్ట్రియన్, ఇస్లాం మతాలను ఆచరించే యాజ్జీ జాతి ప్రజలను ఐఎస్ఐఎ్ సైతాను ఆరాధకులుగా ముద్రవేస్తూ వారిపై పైశాచిక చర్యలకు పాల్పడుతోంది. వారి ఆగడాలకు భయపడి దాదాపు యాభై వేల మంది యాజ్డీలు దేశం విడిచి పారిపోయారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









