వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- April 18, 2024
యూఏఈ: ఏప్రిల్ 16న కుండపోత వర్షం తో రోడ్లన్ని చెరువులుగా మారాయి. అందుకు కార్లు చిక్కుకుపోయి పాడయ్యాయి. వాహనాలను వరదలో వదిలివేయాలనే నిర్ణయం చాలా మందికి బాధాకరంగా అనిపించిందని, కానీ తప్పలేదని పలువురు నివాసితులు వాపోయారు. "నీటి మట్టం పెరుగుతూ ఉండటం, నా కారు మునిగిపోవడం నేను నిస్సహాయంగా చూశాను." అని అల్ నహ్దా నివాసి హదీ అక్బరీ తెలిపారు. అక్బరీ కారు అతని అపార్ట్మెంట్ బ్లాక్ దగ్గర పార్కింగ్ చిక్కుకుపోయింది. చాలామంది తమ కార్లను రోడ్డుపక్కన పార్క్ చేసి, భద్రత కోసం ఎత్తైన ప్రదేశాలకు తప్పించుకోవడానికి వాటిని విడిచిపెట్టినట్టు దుబాయ్‌లోని ఎమిరాటీ అయిన షేఖా వివరించారు. అల్ ముతీనా నివాసి జస్టిన్ సిరిల్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనంలోకి నీరు ప్రవేశించడంతో అల్ ఇత్తిహాద్ రోడ్లో తన కారును వదిలివేశాడు. "ఇది నా జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయం" అని సిరిల్ చెప్పాడు. ఆఫీస్ నుంచి తిరిగొచ్చే సమయంలో తన కారు వరదలో చిక్కుకుందని దాందో దానిని రోడ్డుపైనే వదిలివేసినట్టు భారతీయ నివాసి థామస్ అలెగ్జాండర్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?