పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- April 18, 2024
యూఏఈ: యూఏఈలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసిన తర్వాత, ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో ఎమిరేట్స్ అల్లాడిపోతున్నది. ఈ నేపథ్యంలో పౌరులు మరియు నివాసితుల భద్రతే దేశం యొక్క ప్రధాన ప్రాధాన్యత అని, దేశంలోని మౌలిక సదుపాయాలపై అధ్యయనం చేయాలని యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆదేశించారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల ప్రభావితమైన అన్ని కుటుంబాలకు సహాయం అందించాలని ఆదేశించారు. స్థానిక అధికారుల సహకారంతో ప్రభావితమైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా ప్రజలందరి భద్రత కోసం తక్షణ చర్యలు చేపట్టాలని ఒక ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









