ప్రబాస్ - మారుతి.! ఇప్పట్లో లేనట్లే.!
- April 18, 2024
డైరెక్టర్ మారుతితో కలిసి ప్రబాస్ ‘రాజా సాబ్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సైలెంట్‌గా షూటింగ్ జరిగిపోతోంది. ఈ సినిమా నుంచి రేపో మాపో అప్డేట్ వస్తుందట.. అని ప్రచారం జరుగుతోంది.
అయితే, అలాంటిదేమీ లేదని డైరెక్టర్ మారుతి కన్ఫామ్ చేశారు. కానీ, సినిమా షూటింగ్ మాత్రం సూపర్ ఫాస్ట్‌గా జరిగిపోతోందట. వింటేజ్ బ్యాక్ డ్రాప్లో ఓ బంగ్లాలోనే జరిగే కథగా ఈ సినిమా గురించి చెబుతున్నారు.
ఇంతవరకూ ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప ఇంకే వివరాలు ఈ సినిమా గురించి వెల్లడి చేయలేదు. హారర్ కామెడీ థ్రిల్లర్ అని ప్రచారం జరుగుతోంది.
మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనుపమ పేరు కూడా వినిపిస్తోంది. అసలు మ్యాటర్ ఏంటంటే, మేలో రిలీజ్ కాబోయే ‘కల్కి’ సినిమా తర్వాతే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్లు రిలీజ్ చేస్తారట.
అంతవరకూ ఏ ప్రచారం జరిగినా అందులో ఎలాంటి నిజమూ వుండదని మేకర్లు స్పష్టం చేశారు. ‘కల్కి’ సినిమా తర్వాత ఆడియో సింగిల్ రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘రాజా సాబ్’ రిలీజ్ వుండే అవకాశాలున్నాయ్.
తాజా వార్తలు
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!