ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- April 18, 2024
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో లోక్సభ ఎన్నికల వేళ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్ ప్రకటించింది. ఏప్రిల్ 29న 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రత్యేక క్యాంపెయిన్ ప్రొగ్రామ్ (#VoteAsYouAre) ప్రారంభించింది. 18 ఏళ్ల 22 ఏళ్ల వయస్సు గల యువ ఓటర్లకు ఈ స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నెట్వర్క్లో బేస్ ఛార్జీలపై 19శాతం తగ్గింపును పొందవచ్చు. ఫస్ట్ టైమ్ ఓటు వేసే ఓటర్లు విమాన టికెట్లపై ఈ ప్రోత్సాహకాన్ని అందుకోవచ్చు.
యువ ఓటర్లు తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా ఎయిరిండియా ఈ అద్భుత అవకాశాన్ని అందిస్తోంది. మొదటిసారి ఓటు వినియోగించుకునేందుకు విమానంలో సొంత ప్రాంతాలకు వెళ్లేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల్లోని విమాన టికెట్లపై 19 శాతం తగ్గింపును అందిస్తోంది.
ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 వరకు బుకింగ్:
మొబైల్ యాప్, ఎయిరిండియా వెబ్సైట్ ద్వారా యువ ఓటర్లు తమ విమాన టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 మధ్య ఓటర్లు తమ నియోజకవర్గానికి వెళ్లేందుకు దగ్గరలోని ఎయిర్పోర్టుకు విమాన టికెట్ బుక్ చేసుకోవచ్చు.
క్యాబిన్ సామాను-మాత్రమే ఎంచుకున్నా లేదా బిజినెస్ క్లాస్ సీటింగ్ లగ్జరీని ఎంచుకున్నా యువ ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చునని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ భారత్ అంతటా 31 గమ్యస్థానాలకు సర్వీసులను అందిస్తోంది.
పంజాబ్లోని అమృత్సర్ నుంచి ఏపీలోని విశాఖపట్నం వరకు వివిధ నగరాల్లో నివసిస్తున్న ఓటర్లు తమ ఓటు వేయడానికి వారి స్వస్థలానికి చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లైట్, ఎక్స్ప్రెస్ ఫ్లైక్స్, ఎక్స్ప్రెస్ బిజ్ ఎక్స్ప్రెస్ వాల్యూ విభాగాలకు వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. యువ ఓటర్లు తమ ఐడీ, ఇతర సంబంధిత సర్టిఫికేట్లను సమర్పించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?