జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత

- April 19, 2024 , by Maagulf
జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత

జెడ్డా: శతాబ్దాల నాటి రక్షణ కందకం మరియు కోట గోడ అవశేషాలు హిస్టారిక్ జెడ్డా యొక్క ఉత్తర భాగంలో అలెజియన్స్ స్క్వేర్ సమీపంలో మరియు అల్-కిద్వా స్క్వేర్‌కు తూర్పున కనుగొన్నారు.ఈ విషయాన్ని జెడ్డా హిస్టారిక్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ప్రకటించింది. పురావస్తు ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా చారిత్రాత్మక జెడ్డాలో ఇటీవల నిర్వహించిన పురావస్తు త్రవ్వకాల ఫలితాలను విడుదల చేసింది. చారిత్రక మూలాల ప్రకారం..జెడ్డా 10వ శతాబ్దం చివరిలో 11వ శతాబ్దం AD ప్రారంభంలో ఒక కోటతో కూడిన నగరం.  దాదాపు 18 వ మరియు 19వ శతాబ్దాలలో వీటిని నిర్మించి నట్లు వెల్లడించారు.

19వ శతాబ్దం AD మధ్య నాటికి, కందకం ఉపయోగం లేకుండా పోయిందని,కోట గోడ 1947 వరకు ఉనికిలో ఉందని పేర్కొంది. కందకం రిటైనింగ్ గోడలోని కొన్ని భాగాలు మూడు మీటర్ల ఎత్తు వరకు చెక్కుచెదరకుండా ఉన్నాయి. పురావస్తు త్రవ్వకాలలో 19వ శతాబ్దానికి చెందిన యూరోపియన్ దిగుమతి చేసుకున్న సిరామిక్స్ కూడా బయటపడ్డాయి. ఇది జెడ్డా యొక్క సుదూర వాణిజ్య సంబంధాలను ప్రదర్శిస్తుంది. అల్-కిద్వా స్క్వేర్‌లో 9వ శతాబ్దపు కుండల శకలాలు గుర్తించినట్లు తాజా పురావస్తు పరిశోధనలు వెల్లడించాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com