ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు

- April 19, 2024 , by Maagulf
ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు

యూఏఈ:  యూఏఈళో ఈ ఏడాది 23,500 కొత్త ఉద్యోగాలు క‌ల్పించ‌నున్నారు. 2024లో మొత్తం ఉద్యోగాల సంఖ్య 833,000కి చేరుకోవడంతో ఎమిరేట్స్ ఆర్థిక వ్యవస్థకు ట్రావెల్, టూరిజం రంగ సహకారం పెరుగుతూనే ఉంటుందని వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ (WTTC) ప్రెసిడెంట్, సీఈఓ జూలియా సింప్సన్ తెలిపారు. 2024లో ఈ రంగం సహకారం  GDPలో 12 శాతానికి పెరుగుతుందని, Dh236 బిలియన్లకు చేరుతుందని WTTC తెలిపింది. యూఏఈలో అంతర్జాతీయ సందర్శకుల వ్యయం Dh192 బిలియన్లకు చేరుకోవడానికి దాదాపు 10 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. దేశీయ సందర్శకుల వ్యయం దాదాపు 4.3 శాతం పెరిగి దాదాపు Dh58 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.  ఎమిరేట్స్ ట్రావెల్ అండ్ టూరిజం రంగం 2034 నాటికి 928,000 మందికి ఉపాధి కల్పిస్తుందని, 9 మంది నివాసితులలో ఒకరు ఈ రంగంలో పనిచేస్తున్నారని సింప్సన్  చెప్పారు.  
WTTC విడుదల చేసిన 2024 ఎకనామిక్ ఇంపాక్ట్ రీసెర్చ్ (EIR) నివేదిక ప్రకారం..  యూఏఈ ట్రావెల్ అండ్ టూరిజంలో ఉద్యోగాల సంఖ్య 2023లో 41,000 పెరిగి 809,000కి చేరుకుంది. మిడిల్ ఈస్ట్ ప్రయాణ, పర్యాటక రంగం 2023లో 25 శాతానికి పైగా పెరిగి దాదాపు $460 బిలియన్లకు చేరుకుంది. ఉద్యోగాలు దాదాపు 7.75 మిలియన్లకు చేరుకున్నాయి. అంతర్జాతీయ వ్యయం 50 శాతం పెరిగి $179.8 బిలియన్లకు చేరుకుంది. దేశీయ సందర్శకుల వ్యయం 16.5 శాతం పెరిగి $205 బిలియన్లకు చేరుకుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com