కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- April 19, 2024
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు. సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు విడుతల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దశలోనే అత్యధిక స్థానాల్లో పోలింగ్ జరుగుతున్నది. తొలి విడుతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా, 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 1491 మంది పురుషులు ఉండగా, 134 మంది మహిళా అభ్యర్థులు. 16.63 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 8.4 కోట్ల మంది ఉండగా, మహిళలు 8.23 కోట్ల మంది. 35.67 లక్ష మంది తొలిసారిగా తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.
వీరికోసం 1.87 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 18 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. తొలిదశలో 8 మంది కేంద్రమంత్రులు, ఓ మాజీ గవర్నర్ పోటీలో ఉన్నారు. లోక్‌సభ స్థానాలతోపాటు రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా నేడే పోలింగ్ జరుగుతున్నది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







