దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- April 20, 2024
దుబాయ్: భారీ వర్షాల సమయంలో దెబ్బతిన్న దుబాయ్‌లోని తమ కమ్యూనిటీలలోని అన్ని ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు చేస్తామని ఎమ్మార్ ప్రాపర్టీస్ శుక్రవారం తెలిపింది. ఈ మేరకు ఎమ్మార్ ప్రాపర్టీస్ చైర్మన్ మొహమ్మద్ అలబ్బర్ తెలిపారు. వర్షాల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఎమ్మార్ కమ్యూనిటీలలోని వేలాది మంది నివాసితులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగిస్తోందన్నారు.
దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ ఎమిరేట్‌లో అతిపెద్ద మాస్టర్ డెవలపర్. డౌన్‌టౌన్ దుబాయ్, ఎమ్మార్ సౌత్, దుబాయ్ హిల్స్ ఎస్టేట్, దుబాయ్ క్రీక్ హార్బర్, అరేబియన్ రాంచెస్, దుబాయ్ మెరీనా, ది వ్యాలీ మరియు అడ్రస్ రెసిడెన్స్ జబీల్ వీటి ప్రాజెక్టులు. 2002 నుండి దుబాయ్ మరియు ఇతర మార్కెట్‌లలో సుమారు 108,000 రెసిడెన్షియల్ యూనిట్లను డెలివరీ చేసింది.
తాజా వార్తలు
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!







