రుణాల చెల్లింపునకు సహెల్ యాప్‌లో కొత్త ఫీచర్

- April 20, 2024 , by Maagulf
రుణాల చెల్లింపునకు సహెల్ యాప్‌లో కొత్త ఫీచర్

కువైట్: న్యాయ మంత్రిత్వ శాఖ సహెల్ అప్లికేషన్ ద్వారా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్‌కు రుణాల చెల్లింపుల కోసం కొత్త సేవను జోడించింది. ఈ సేవ వినియోగదారులు చెల్లించాల్సిన రుణాలకు సంబంధించిన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ సేవ ద్వారా వ్యక్తులు తమ రుణాలను పాక్షికంగా లేదా పూర్తిగా చెల్లించవచ్చు. చెల్లింపు తర్వాత ప్రయాణ నిషేధాలు, వాహనాల సీజ్‌లు లేదా రుణగ్రహీత ఆస్తులను స్తంభింపజేయడం వంటి అన్ని పరిపాలనా విధానాలు ఆటోమేటిగ్గా ఎత్తివేయబడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com