కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- April 20, 2024
అమరావతి: కడప నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేకా కుమార్తె సునీతతో కలిసి కడప కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి షర్మిల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడప నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో మంచి తీర్పు ఇస్తారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
అంతకుముందు షర్మిల ఎక్స్‌లో పోస్టును షేర్ చేస్తూ.. ‘‘ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో, దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకుని, న్యాయం కొరకు, విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారిని, వైఎస్ వివేకానందరెడ్డి గారిని మరిచిపోలేని ప్రజలు, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ధర్మం వైపే మన కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తుంది మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ’’ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
- సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్
- జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు
- ఐసిసి ర్యాంకింగ్ లో 'కింగ్' విరాట్ కోహ్లినే!!
- సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటి
- శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!