సినిమా రివ్యూ: ‘పారిజాతపర్వం’

- April 20, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: ‘పారిజాతపర్వం’

ఈ వారం పెద్ద సినిమాలేమీ ధియేటర్లలోకి రాలేదు. చిన్న సినిమాల్లో ‘పారిజాత పర్వం’ కొద్దగా హంగామా చేసింది. ఒకింత ప్రమోషన్లు బాగానే చేశారీ సినిమాకి. స్టార్ కాస్టింగ్ విషయానికి వస్తే, ‘30 వెడ్స్ 20’ వెబ్ సిరీస్‌తో పాపులరైన చైతన్య రావు హీరోగా నటించాడు. సునీల్ ఇంపార్టెంట్ రోల్ పోషించాడు. వైవా హర్ష, శ్రద్ధాదాస్, మాళవిక సతీశన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. అయితే, ‘పారిజాత పర్వం’ సినిమా ఎలా వుందో చూడాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
చైతన్య (చైతన్య రావు) డైరెక్టర్ అవ్వాలని కలలు కంటుంటాడు. ఓ రియల్ స్టోరీని తన ఫ్రెండ్ హర్ష (వైవా హర్ష) హీరోగా తెరకెక్కించాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో నిర్మాతల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారిపోతాడు. మరోవైపు బార్ శీను (సునీల్) హీరో అవుదామని అనుకోకుండా డాన్ అవుతాడు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య తమ తమ కలల్ని నెరవేర్చుకునే క్రమంలో చైతన్య అండ్ టీమ్ ఓ బడా నిర్మాత (శ్రీకాంత్ అయ్యంగార్) రెండో భార్య సురేఖ (సురేఖ వాణి)ని కిడ్నాప్ చేస్తారు. ఈ కిడ్నాప్ చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. ఈ కథలోనే పార్వతి (శ్రద్ధా దాస్) పాత్ర ఏంటీ.? అసలు బార్ శీనుకీ, చైతన్యకీ వున్న లింకేంటీ.? కిడ్నాప్ పర్వంతో తమ కలను హీరో నెరవేర్చుకున్నాడా.? తెలియాలంటే ‘పారిజాత పర్వం’ ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
చైతన్య రావు పలు వెబ్ సిరీస్‌లు ‘కీడా కోలా’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఈ సినిమాలోనూ తనదైన నటనతో ఆకట్టుకుంటాడు. వైవా హర్ష కామెడీ టైమింగ్ గురించీ, పర్‌పామెన్స్ గురించీ తెలిసిందే. ఏమాత్రం తగ్గకుండా తనవంతు పర్‌పామెన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో మరోసారి మెప్పించాడు ఈ సినిమాతో. హీరోయిన్ మాళవిక తనకున్న పాత్ర పరిధి మేర ఓకే అనిపించింది. హీరోతో కెమిస్ర్టీ బాగా పండించింది. శ్రద్దా దాస్ పాత్రకు ఇంపార్టెన్స్ ఎక్కువే. కానీ, ఎందుకో ఆమె పాత్ర ఎలివేట్ కాలేదు. ఇక, ముఖ్యంగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్ సునీల్. ఈ మధ్య సునీల్ ఒకే తరహా క్యారెక్టర్లతో బోర్ కొట్టించేస్తున్నాడన్న టాక్ వుంది. ఈ సినిమాలోనూ బోరింగ్ క్యారెక్టర్‌లోనే కనిపించాడు. మంచి స్కోపున్న క్యారెక్టర్ అయినా డైరెక్టర్ సరిగ్గా డిజైన్ చేయలేదనిపిస్తుంది. అలాగే మిగిలిన పాత్ర ధారులు శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ  వాణి తదితరులు తమ తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. ముందుగా దర్శకుడు సంతోష్ కంభంపాటి ఏదో అనుకున్నాడు ఇంకేదో చేశాడు. ఆల్రెడీ అలవాటైపోయిన కామెడీ థ్రిల్లర్ల జోనర్‌ని టచ్ చేసినప్పుడు విభిన్నంగా ఏం చేశామన్నది ఇంపార్టెంట్ పాయింట్. కానీ, అలా కొత్తగా ఏమీ కనిపించలేదు ‘పారిజాత పర్వం’లో. పరమ రొటీన్ రొట్ట కొట్టుడే. కథలో కొత్తదనం లేకపోయినా కథనంలోనైనా పట్టుండాలి. అదీ కూడా కనిపించదు పారిజాత పర్వంలో. ఇక రీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజీక్ అస్సలు ఆకట్టుకోదు. నిర్మాణ విలువలు బడ్జెట్‌లో బాగున్నాయ్. బాల సరస్వతి సినిమాటోగ్రఫీకి మెచ్చుకునేలా వుంది. ఎడిటింగ్‌లో చాలా పని వుంది.

ప్లస్ పాయింట్స్:
అక్కడక్కడా కొన్ని కామడీ సీన్లు, హీరో, హీరోయిన్ మధ్య వచ్చే కార్ ఎపిసోడ్‌లో పండిన కామెడీ బాగుంది. వైవా హర్ష సీన్లు కొన్ని నవ్వు పుట్టిస్తాయ్.

మైనస్ పాయింట్స్:
కొత్తదనం లేని కథ, పట్టు లేని కథనం, రిపీట్ రిపీట్ అనిపించేలా బోర్ కొట్టించే సన్నివేశాలు.

చివరిగా:
‘పారిజాత పర్వం’.. మిస్ ఫైర్ అయిన సిల్లీ కామెడీ కిడ్నాప్ డ్రామా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com