కాషాయ రంగులో దూర‌ద‌ర్శ‌న్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు

- April 20, 2024 , by Maagulf
కాషాయ రంగులో దూర‌ద‌ర్శ‌న్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు

న్యూఢిల్లీ: దూర‌ద‌ర్శ‌న్ లోగో తన రంగును ఎరుపు నుంచి ఆరెంజ్ రంగుకు మార్చారు. కాషాయ రంగుంలో ఉన్న ఆ లోగోపై వివాదం చెల‌రేగుతున్న‌ది. దూర‌ద‌ర్శ‌న్‌కు చెందిన డీడీ న్యూస్ ఇంగ్లీష్ ఛాన‌ల్‌.. కొత్త రంగులో ఉన్న లోగోను ప్రమోట్ చేస్తూ వీడియోను త‌న ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేసింది. విలువ‌లు అలాగే ఉన్నాయ‌ని, కానీ మేం ఇప్పుడు కొత్త అవ‌తారంలో ద‌ర్శ‌నం ఇస్తున్నామ‌ని, గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో వార్తా ప్ర‌యాణానికి స్వాగ‌తం అని, డీడీ న్యూస్‌ను కొత్త‌గా అనుభ‌వించండి అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు.

లోగో రంగును మార్చ‌డం ప‌ట్ల తృణ‌మూల్ ఎంపీ జ‌వ‌హ‌ర్ సిర్‌చ‌ర్ విమ‌ర్శ‌లు చేశారు. ఆ లోగో రంగు తగిన విధంగా లేద‌న్నారు. దూర‌ద‌ర్శ‌న్ లోగోను కాషాయంలోకి మార్చ‌డం చాలా బాధ‌గా ఉంద‌ని, ఇప్పుడు ఇది ప్ర‌సార భార‌తి కాదు అని, ప్ర‌చార భార‌తిగా మారింద‌ని మాజీ సీఈవో త‌న పోస్టులో విమ‌ర్శించారు. గ‌తంలో ప్ర‌సార భార‌తి సీఈవోగా సిర్‌చ‌ర్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. 2012 నుంచి 2016 వ‌ర‌కు ఆయ‌న డీడీ, ఆల్ ఇండియా రేడియోకు సీఈవోగా చేశారు. లోగోకు కొత్త రంగు వేయ‌డం ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘించిన‌ట్లు అవుతుంద‌ని ఆరోపించారు.

అయితే ప్ర‌సార భార‌తి ప్ర‌స్తుత సీఈవో మాత్రం సిర్‌చ‌ర్ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. విజువ‌ల్ ఈస్థ‌టిక్స్‌కు అనుగుణంగా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఆరెంజ్ క‌ల‌ర్ లోగోను త‌యారు చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఛాన‌ల్ బ్రాండింగ్‌, విజువ‌ల్ ఈస్త‌టిక్స్ ఆధారంగా క‌ల‌ర్‌ను ఎంపిక చేశామ‌ని, లోగో ఒక్క‌టే కాదు, డీడీ ఛాన‌ల్ లుక్‌, ఫీల్‌ను అప్‌గ్రేడ్ చేశామ‌న్నారు. కొత్త లైటింగ్, ఎక్విప్మెంట్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com