ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- April 20, 2024
న్యూ ఢిల్లీ: భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ చంద్రచూడ్ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. ఓటువేసే అవకాశాన్ని ప్రజలు కోల్పోవద్దని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది పౌరుల ప్రధాన కర్తవ్యం అని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ‘మై ఓట్ మై వాయిస్’ మిషన్ కోసం సీజేఐ ఓ వీడియో సందేశం పంపారు. ‘భారతదేశం ప్రజాస్వామ్యంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలోని పౌరులుగా మనకు అనేక హక్కులున్నాయి. అలాగే కొన్ని విధులను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. అందులో మొదటిది ఓటు వేయడమే. దీనిని సక్రమంగా నిర్వర్తించాలి’ అని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు