‘అశ్వత్థామ’గా అమితాబ్ బచ్చన్..
- April 21, 2024హైదరాబాద్: ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898AD’ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఇది హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది అని అంతా భావిస్తున్నారు. ఈ సినిమాని నిర్మాత అశ్విని దత్ 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మేలో ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఎన్నికల టైం కావడంతో కల్కి మరోసారి వాయిదా పడింది.
తాజాగా నేడు ఈ సినిమా నుంచి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ని రివీల్ చేసారు. ఐపీఎల్ మూడ్ లో అందరూ ఉండగా దానికి ఇంకొంచెం హ్యాపినెస్ ఇస్తూ స్టార్ స్పోర్ట్స్ లో అమితాబ్ బచ్చన క్యారెక్టర్ రివీల్ చేశారు. ఈ సినిమాలో అమితాబ్ అశ్వత్థామగా కనపడబోతున్నట్టు, ద్వాపర యుగం నుంచి విష్ణువు చివరి అవతారం కల్కి కోసం ఎదురుచూస్తున్నట్టు ఈ గ్లింప్స్ ద్వారా తెలిపారు.
దీంతో మరోసారి కల్కి సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా 6000 సంవత్సరాల కథతో జరుగుతుందని, ఈ సినిమాలో పురాణాల ప్రకారం చెప్పిన ఏడుగురు చిరంజీవులు ఉంటారని వార్తలు వచ్చాయి. అమితాబ్ ని అశ్వత్థామ క్యారెక్టర్ గా చూపించడంతో అంతా ఈ వార్తలు నిజమే అవుతాయని భావిస్తున్నారు. కల్కి సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం