వరల్డ్ ఎర్త్ డే
- April 22, 2024
వాతావరణ సంక్షోభంపై దృష్టి సారిస్తూ.. ప్రపంచంలోని దేశాలన్ని.. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన వరల్డ్ ఎర్త్ డే(World Earth Day) జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజున పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, అవసరం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
రోజు రోజుకూ తీవ్రమవుతున్న ప్రపంచ వాతావరణ సంక్షోభంపై దృష్టి సారిస్తూ ఎర్త్డే చేస్తారు. అధిక జనాభా, జీవవైవిధ్యాన్ని కోల్పోవడం, ఓజోన్ పొర క్షీణించడం, పెరుగుతున్న కాలుష్యంతో సహా పెరుగుతున్న పర్యావరణ సమస్యలపై ఈ రోజు ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
ఎర్త్ డేను మొదటిసారిగా ఏప్రిల్ 22, 1970న జరుపుకొన్నారు. 1969లో శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన UNSEO సమావేశంలో శాంతి కార్యకర్త జాన్ మెక్కానెల్ భూమి, శాంతి అనే భావనను ప్రతిపాదించాడు. ప్రపంచ ఎర్త్ డేని మొదట మార్చి 21, 1970న నిర్వహించాలని ప్రతిపాదించారు. తరువాత యునైటెడ్ స్టేట్స్ సెనేటర్ గేలార్డ్ నెల్సన్ ఏప్రిల్ 22, 1970న దేశవ్యాప్త పర్యావరణపై ఆందోళనను
ప్రేరేపించారు. ఆ రోజును ఎర్త్ డే అని పేరు పెట్టారు.
వాతావరణ మార్పుల కారణంగా భూమిపై ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. దీనితో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. పర్యావరణ మార్పులతో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఎప్పుడూ వర్షాలు పడే ప్రాంతాల్లో కరువు వస్తుంది. అసలు వానలే లేని ప్రాంతంలో వరదలు వస్తుంటాయి. మనం చేస్తున్న తప్పులతో చాలా దేశాలలో నీటి సమస్యలు తలెత్తాయి. ఈ భూమిని మనిషి ఎంత స్వార్థంతో వినియోగిస్తాడో ప్రకృతి కూడా అంతే నష్టాన్ని తిరిగి కలిగిస్తుంది. ప్రకృతిని కాపాడుకుంటేనే సంతోషకరమైన జీవితం గడపడం సాధ్యమవుతుంది.
పర్యావరణానికి దగ్గరగా ఉండడం అంటే పర్యావరణాన్ని ప్రేమించడం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. సేంద్రియ పదార్థాలు వాడాలి. ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ బ్యాగ్ ఉపయోగించవద్దు. కార్లు, బైక్లకు బదులు సైకిళ్లను ఎక్కువగా వాడితే వాయు కాలుష్యం తగ్గుతుంది. ప్రతి మనిషి తన జీవితకాలంలో చెట్లను నాటాలి. ఇది మన తర్వాతి తరానికి మనం ఇచ్చే గొప్ప బహుమతి.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
- మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు
- బక్రీద్ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!









