డోంట్ మ్యారీ.. బీ హ్యాపీ అంటోన్న యంగ్ హీరో.!
- April 22, 2024
డైరెక్టర్ అవ్వాలని వచ్చి అనుకోకుండా హీరో అయిపోయాడా కుర్రాడు. డబుల్ హ్యాట్రిక్ కొట్టి తిరుగులేని స్టార్‌డమ్ దక్కించుకున్నాడు. కానీ, అనుకోకుండా వరుస ఫ్లాపులు వెంటాడాయ్. దాంతో ఎంత స్పీడుగా రేస్‌లో దూసుకొచ్చాడో.. అంతే స్పీడుగా రేస్‌లో వెనకబడిపోయాడు.
ఇంతకీ ఎవరా హీరో.? ఏంటా కథ.? అంటే, రాజ్ తరుణ్. ‘ఉయ్యాలా జంపాలా ’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ‘కుమారి 21 ఎఫ్’, ‘సినిమా చూపిస్త మామా’ తదితర చిత్రాలతో డబుల్ హ్యాట్రిక్ కొట్టేశాడు. కానీ, ఆ తర్వాత దురదృష్టం వెంటాడింది.
వరుసగా ఫ్లాపులొచ్చేశాయ్. అంతే అడ్రస్ గల్లంతైపోయింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడు. రీసెంట్‌గా నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో పెద్ద ఇంపార్టెన్స్ రోలేమీ పోషించలేదు. కానీ, వున్నానంటే వున్నాననిపించుకున్నాడు. కానీ, ఇప్పుడు మనోడి చేతిలో ఓ మూడు ప్రాజెక్టులున్నాయనుకోండి.
ఆ సంగతి అటుంచితే, మనోడికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట. సోలో లైఫే సో బెటర్ అంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ యంగ్ హీరో తన పెళ్లి ప్రస్థావన వస్తే.. ఇచ్చిన సమాధానమిది. పెళ్లి, పిల్లల విషయంలో దూరంగా వుండాలనుకుంటున్నాను.. నా తల్లితండ్రులు కూడా ఆ విషయంలో నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదంటూ సమాధానమిచ్చాుడు. అదేంటో.! రాజ్ తరుణ్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటో.!
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్‌లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







