కృతి శెట్టి బౌన్స్ బ్యాక్ అవుతుందా.?
- April 22, 2024స్టార్ హీరోయిన్గా టాప్ చెయిర్ని అధిరోహించినట్లే అధిరోహించి ఢమాల్న కింద పడిపోయినట్లైంది కృతి శెట్టి పరిస్థితి. వరుస ఆఫర్లు.. కొంత కాలం పాటు ఏ సినిమాలో చూసినా కృతి శెట్టినే.. హీరో మాత్రమే వేరు.. హీరోయిన్ కృతి శెట్టి.. అంతే అన్నట్లుగా వుంది.
కానీ, ఆమె చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయిపోవడంతో ఐరెన్ లెగ్ ముద్ర పడిపోయింద. రొటీన్ రొట్ట కొట్టుడుతో కృతి శెట్టి బోర్ కొట్టించేసింది. వచ్చిన ప్రతీ ఆఫర్‌నీ అంది పుచ్చేసుకుంటే ఇలాగే వుంటుంది అని కృతి శెట్టిని అప్పట్లో తెగ ట్రోల్ చేసేశారు.
దాంతో, అందం, అభినయం వున్న అందాల భామ కృతి శెట్టి టాలీవుడ్‌కి దూరమైపోయింది. మళ్లీ ఇప్పుడే ‘మనమే’ సినిమాతో రాబోతోంది. శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఓ బాబుకు తల్లిగా నటిస్తోంది కృతి శెట్టి.
అదే క్యూట్ అప్పీల్.. ఆకట్టుకునే అభినయం.. అన్నీ వున్నా ఎందుకో సినిమాకి వుండాల్సిన కళ అయితే కనిపించడం లేదు. ఏమో కొన్ని సినిమాలు పోస్టర్లతో ఎట్రాక్ట్ చేస్తాయ్. తీరా రిలీజ్ తర్వాత డిజప్పాయింట్ చేస్తాయ్. కొన్ని సినిమాలు పోస్టర్లలో విషయం లేకపోయినా రిలీజ్ తర్వాత విపరీతంగా ఆకట్టుకుంటాయ్.
అలా ‘మనమే’ హిట్ అయితే కనుక మళ్లీ కృతి శెట్టి ఈజ్ బ్యాక్.. ఇది పక్కా.!
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ