‘చదువుల తపస్వి.. ఈ మనస్వి..’ ఏపీ పదోతరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్..
- April 22, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి కనీవినీ ఎరుగని రికార్డును సాధించింది. మొత్తం 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచింది. ప్రస్తుతం మనస్వి పేరు సోషల్ మీడియాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది.
ఒక్క సెకండ్ లాంగ్వేజ్ (హిందీ) మినహా మిగతా సబ్జెక్టుల్లో ఆమె వంద శాతం మార్కులు సాధించింది. హిందీ సబ్జెక్టులో ఆమెకు 100కి గాను 99 మార్కులు వచ్చాయి. స్టేట్ టాపర్‌గా నిలవడంతో ఆమె ఆనందానికి ఆవధులు లేకుండా పోయాయి. చదువుల తపస్వి ఈ మనస్వి అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
బాలికలదే హవా..
మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. మొత్తం 6,16,617 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష రాశారు. వీరిలో 5,34,574 (86.69శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 84.32 శాతం బాలురు, బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణులు అయ్యారు. అంటే బాలుర కంటే బాలికలు 4.98 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు.
పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి..రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్, అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?