గుండె పోటుకు ఈ నొప్పులు సంకేతాలా.?

- April 22, 2024 , by Maagulf
గుండె పోటుకు ఈ నొప్పులు సంకేతాలా.?


ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య అధికమైపోయింది. వయసుతో సంబంధం లేకుండా సడెన్ హార్ట్ ఎటాక్ మరణాలు ఎక్కువగా వింటున్నాం. అయితే, హార్ట్ ఎటాక్ అనేది సడెన్‌గానే వస్తుందా.? లేదంటే ఏమైనా సంకేతాలుంటాయా.? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని కొన్ని నొప్పులు గుండెపోటుకు సంకేతాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి నొప్పుల్ని అస్సలు అశ్రద్ధ చేయరాదని అంటున్నారు. సింపుల్‌గానే చాలా క్యాజువల్ అనిపించే ఆయా నొప్పులు కొన్ని సందర్భాల్లో గుండె పోటుకు సంకేతాలు కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

భుజం నొప్పి కొంత మందిలో వేధిస్తుంటుంది. ఎడమ వైపు భుజం నొప్పిని అశ్రద్ధ చేయరాదు. ఏదో బరువులు ఎత్తడం వల్లనో, లేదంటే పడుకోవడంలో పొజిషన్ డిఫరెన్స్ వల్లనో భుజం నొప్పి వచ్చిందని లైట్ తీసుకుంటారు. కానీ, అన్ని సార్లూ భుజం నొప్పిని అశ్రద్ద తీసుకోరాదని వైద్యుని సంప్రదించాలని చెబుతున్నారు.

అలాగే వెన్ను నొప్పి కూడా కొన్ని సందర్భాల్లో డేంజర్‌గా పరిగణించాలని చెబుతున్నారు. చాలా సహజంగా అనిపించే ఛాతీ నొప్పి కూడా గుండె నొప్పి సంకేతాల్లో ఒకటిగా చెబుతున్నారు.

దీర్గ కాలంగా ఛాతి నొప్పి వేధిస్తుంటే.. అస్సలు అశ్రద్ధ చేయకుండా వైద్యుని సలహా తీసుకోవాలని అంటున్నారు. మెడ పట్టేయడం, నొప్పి కూడా గుండె నొప్పికి కారణం కారణం కావచ్చు. సో, నొప్పి ఏదైనా చిన్నదే కదా అని లైట్ తీసుకోవద్దు సుమా.! ఇన్ టైమ్‌లో రెస్పాండ్ అయ్యి వైద్యుని సలహా కానీ, అవసరమైతే చికిత్స కానీ, తీసుకోవడం వుత్తమం.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com