పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- April 23, 2024
అమరావతి: పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం చేబ్రోలులోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయల్దేరిన పవన్ కల్యాణ్ పిఠాపురం పాదగయ క్షేత్రం మీదుగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ పక్కన ఆయన సోదరుడు నాగబాబు, పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఉన్నారు. నామినేషన్ అనంతరం పవన్ చేబ్రోలు తిరిగి వచ్చారు. ఈ సాయంత్రం పవన్ కల్యాణ్ ఉప్పాడలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు.
కాగా, పవన్ నామినేషన్ ర్యాలీలో మూడు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కిలోమీటర్ల పొడవునా బైకులు, వాహనాలతో పవన్ ను అనుసరించిన కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో హోరెత్తించారు.
నామినేషన్ వేసేందుకు బయల్దేరే ముందు పవన్… తన విజయం కోసం ప్రార్థించిన ఓ క్రైస్తవ మహిళకు పాదాభివందనం చేశారు. కాగా, నామినేషన్ వేయడానికి వెళుతున్న పవన్ కల్యాణ్ కు పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ అర్ధాంగి హారతి ఇచ్చి తిలకం దిద్దారు. వర్మ… పవన్ కు శాలువా కప్పారు.
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం







