తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- April 24, 2024
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు గుడ్ న్యూస్..ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వచ్చేసాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్స్‌కు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. ఇందులో 4,78,527 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు ఉన్నారు.కాగా ఈ రోజు విడుదలైన ఫలితాల్లో ఇంటర్ ఫస్టియర్ 60.01 శాతం ఉత్తీర్ణత సాధించారు.
సెకండియర్ లో 64.19 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లు అయిన https://tsbie.cgg.gov.in/, http://results.cgg.gov.inలో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మార్కుల మెమో సాఫ్ట్ కాపీని ప్రింట్ తీసుకోవచ్చు. తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 9,80,978 మంది పరీక్షలు రాశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు