పుచ్చకాయను గింజలతో తినేస్తే ఏం జరుగుతుంది.?

- April 24, 2024 , by Maagulf
పుచ్చకాయను గింజలతో తినేస్తే ఏం జరుగుతుంది.?

పుచ్చకాయ (వాటర్ మిలాన్) వేసవిలో అమృత ఫలంగా భావిస్తారు. ఎందుకంటే దీనిలో అధిక శాతం నీరుంటుంది. వేసవి తాపాన్ని తీర్చే అమృత పలంగా అందుకే పుచ్చకాయను అభివర్ణిస్తుంటారు. అయితే, పుచ్చకాయలో గింజలు కూడా ఎక్కువే వుంటాయ్.

చాలా జాగ్రత్తంగా పుచ్చకాయలోని గింజల్ని తీసేసి తింటుంటాం. కానీ, పొరపాటున కొన్ని కొన్ని గింజలు నమిలి మింగేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. అలాంటి సందర్భాల్లో అనేక అపోహలు.

పుచ్చకాయను గింజలతో పాటూ తినేస్తే ఏం జరుగుతుంది.? అన్న అనుమానాలు. అయితే పుచ్చకాయ గింజల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని నిపుణులు చెబుతున్నారు.

పుచ్చకాయ గింజల్లో ప్రొటీన్లు, విటమిన్లతో పాటూ, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాలు మిళితమై వుంటాయ్. అంతేకాదు, పొటాషియం, కాల్షియం అధిక పాళ్లలో వుంటుంది పుచ్చకాయ గింజల్లో. ప్రొటీన్లతో పాటూ జింక్, ఐరన్, మెగ్నీషియం కూడా పుష్కలంగా వుండడంతో జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది.

పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా వుండడం వల్ల్ల చెడు కొలెస్ర్టాల్‌ని కరిగించేస్తుంది. తద్వారా గుండె జబ్బులొచ్చే అవకాశాలు కూడా తక్కువగా వుంటాయని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ గింజల్లో అధికంగా మెగ్నీషియం వుండడం వల్ల రక్తపోటు నియంత్రణలో వుంటుంది. అంతేకాదు, పొడి చర్మం సమస్యను కూడా పుచ్చకాయ గింజల్ని తినడం వల్ల నియంత్రణలో వుంచుకోవచ్చు.

ఇంకేం.! నిర్భయంగా గింజలతో పాటూ పుచ్చకాయ ముక్కల్ని ఎంచక్కా లాగించేయొచ్చు. అంతేకాదండోయ్ పుచ్చకాయ గింజలు తింటుంటే,  డ్రై ప్రూట్స్ తింటున్నట్లుగానే నోటికి మంచి టేస్ట్ కూడా తగులుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com