పుష్ప 2 ఫస్ట్ సింగల్ ప్రోమో వచ్చేసింది..
- April 24, 2024
హైదరాబాద్: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇటీవలే ఈ మూవీ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన మేకర్స్.. ఇప్పుడు మొదటి సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వంలో మొదటి భాగం సాంగ్స్ ఎంతటి హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
దీంతో సెకండ్ పార్ట్ సాంగ్స్ పై భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన మొదటి సాంగ్ ప్రోమో ఆ హైప్ ని అందుకునేలా కనిపిస్తుంది. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ పాటకి చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఇక ఈ ఫుల్ లిరికల్ సాంగ్ ని మే 1న ఉదయం 11:07 ని.లకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి ఇప్పుడు రిలీజ్ చేసిన ఆ ప్రోమోని మీరు కూడా వినేయండి.
కాగా పుష్ప 1 సాంగ్స్ లో దేవిశ్రీ అండ్ సుకుమార్ ఓ పాటర్న్ ఫాలో అయ్యారు. మూవీలో ఐదు సాంగ్స్ ఉండగా.. వాటిని అన్నిటిని రచయిత చంద్రబోస్ తోనే రాయించారు. అలాగే తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ వెర్షన్ సాంగ్స్ ని కూడా ఆయా భాషల్లోని సింగల్ రచయితతోనే మొత్తం సాంగ్స్ రాయించారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ లోని మొదటి సాంగ్ కి కూడా చంద్రబోస్ లిరిక్స్ రాసారు. చూస్తుంటే ఈ మూవీలోని సాంగ్స్ కి కూడా చంద్రబోసే రాస్తున్నట్లు తెలుస్తుంది.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!