భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..

- April 24, 2024 , by Maagulf
భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..

మన భారతీయుల కోసమే డిజైన్ చేసిన కొత్త షూ సైజింగ్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. అంతేకాదు.. ఈ షూ సైజింగ్ సిస్టమ్‌కు ‘భారత్’కి ‘భా’ అని పేరు కూడా పెట్టారు. ఇప్పటివరకూ మనం వాడే షూ సైజులు యూకే/యూరోపియన్, యూఎస్ సైజుల పేరుతో పిలిచేవారు. ఇకపై వీటి స్థానాన్ని మన దేశీయ ఫుట్‌వేర్ నెంబర్ సిస్టమ్ భర్తీ చేయనుంది.

ప్రస్తుతానికి వ్యక్తుల ఫుట్ సైజు పరిమాణం పొడువు మాత్రమే పరిగణనలోకి తీసుకునేవారు.. అలా కాకుండా వెడల్పు కూడా పరిగణనలోకి తీసుకుని ఈ సిస్టమ్ రూపొందించారు. ఇటీవలి సర్వే ఫలితాల్లో.. డిసెంబర్ 2021, మార్చి 2022 మధ్య సర్వే నిర్వహించగా.. 79 ప్రాంతాల్లో  లక్ష మంది భారతీయుల 3డీ ఫుట్ స్కానింగ్‌ తీసుకున్నారు.

ఇందులో సగటు భారతీయ పాదాల పరిమాణం, కొలతలు, నిర్మాణం ఆధారంగా రూపొందించారు. అయితే, డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI)తో సంయుక్తంగా ‘ఇండియన్ ఫుట్ వేర్ సైజింగ్ సిస్టమ్’ అభివృద్ధి చేసింది. ఈ సిస్టమ్ ఎంతవరకు సరైనదో తేల్చేందుకు దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఈ క్రమంలోనే ఆమోదానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)కి నివేదిక కూడా సమర్పించారు.

సర్వేలో ఏం తేలిందంటే? 
యూరప్ లేదా అమెరికా కన్నా భారతీయుల పాదాలు సాధారణంగా వెడల్పుగా ఉంటాయని సర్వే వెల్లడించింది. ప్రస్తుత ఫుట్‌వేర్ సైజింగ్ సిస్టమ్‌లో చాలా మంది భారతీయులు చాలా పెద్దవి లేదా తక్కువ ఫిట్టింగ్‌తో బూట్లు ధరిస్తున్నారని కూడా వెల్లడించింది.

భారతీయ మహిళల సగటు అడుగుల పరిమాణం పెరుగుదల 11 ఏళ్ల వయస్సులో ఉండగా, భారతీయ పురుషులలో 15 లేదా 16 ఏళ్ల వయస్సులో గరిష్ట స్థాయికి చేరుకుందని సర్వేలో తేలింది. షూలేస్‌లు సైతం బిగుతుగా ఉండటంతో ధరించినవారికి రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుంది. అసౌకర్యం, గాయాలతో పాటు పాదాల అనారోగ్య సమస్యలకు దారితీసింది. ముఖ్యంగా వృద్ధులు, మధుమేహం ఉన్నవారిలో ఈ సమస్య తీవ్రంగా ఉందని సర్వేలో తేలింది.

‘భా’ సిస్టమ్ అంటే ఏంటి? 
‘భా’ షూ సైజింగ్ సిస్టమ్ అనేది వివిధ వయసుల వారికి సరిపోయేలా 8 నెంబర్ పాదరక్షల సైజులతో రూపొందించారు. దాదాపు 85శాతం మంది భారతీయులకు మెరుగైన ఫిట్‌మెంట్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పుతో సగానికి సగం సైజులను తొలగించడంతో షూల తయారీ మరింత సులభతరం కానుంది.

‘భా’ షూ సైజింగ్ సిస్టమ్ మొత్తం 8 సైజులను ప్రవేశపెట్టింది. అందులో శిశువుల నుంచి 15ఏళ్లు పైబడిన భారతీయుల కోసం ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. మెజారిటీ భారతీయుల అవసరాలను తీర్చడానికి ప్రధానంగా 3 నుంచి 8 సైజులపై దృష్టి పెడుతోంది. 2025లో ఈ కొొత్త షూ సైజింగ్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది.

1 – శిశువులు (0-1 సంవత్సరం)
2 – పసిబిడ్డలు (1-3 సంవత్సరాలు)
3 – చిన్న పిల్లలు (4-6 సంవత్సరాలు)
4 – పిల్లలు (7-11 సంవత్సరాలు)
5 – బాలికలు (12-13 సంవత్సరాలు)
6 – బాలురు (12-14 సంవత్సరాలు)
7 – మహిళలు (14 ఏళ్లు, అంతకంటే ఎక్కువ)
8 – పురుషులు (15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com