బార్లీ నీళ్లు.! వీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.?
- April 25, 2024బార్లీ నీళ్లు తాగడంవల్ల జీర్ణ శక్తి మెరుగవుతుంది. ముఖ్యంగా ఎండ తాపాన్ని తట్టుకునే శక్తినిస్తుంది. వేసవిలో ప్రతీరోజూ ఉదయాన్నే బార్లీ నీళ్లు తాగేవారిలో తక్షణ శక్తితో పాటూ, ఎండ తాపాన్ని తట్టుకునే శక్తి కూడా వస్తుంది.
అలాగే బార్లీలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా వుండడంతో అధిక బరువు సమస్యలు కూడా దరి చేరవు. మూత్ర పిండాల్లో రాళ్లున్నవారు క్రమం తప్పకుండా బార్లీ నీళ్లు తాగితే మందులు అవసరం లేకుండానే వాటిని కరిగించుకోవచ్చు.
మూత్ర విసర్జన ద్వారా టాక్సిన్స్‌ని బయటికి పంపిచేందుకు తోడ్పడతాయ్ బార్లీ గింజలు. తద్వారా కిడ్నీ స్టోన్స్ ప్రమాదం వుండదు.
అలాగే, ఇందులోని ఫైబర్ అనవసరమైన కొవ్వు కణాల్ని కరిగించేయడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మెగ్నీషియం, కాల్షియం అధికంగా వుండడం వల్ల ఎముకలు ధృఢంగా మారతాయ్. తక్కువ గ్లైసెమిక్ కలిగి వుండడం వల్ల బార్లీ నీళ్లు మధుమేహులకు కూడా మంచి ఆరోగ్యకారిగా చెబుతారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం