రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- April 25, 2024
హైదరాబాద్: రిజర్వేషన్లు రద్దుకోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నం చేస్తున్నారని, ఆర్ఎస్ఎస్ ఆలోచనను దేశంపై రుద్దాలనే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్డీయే పదేళ్ల పాలనపై గాంధీ భవన్ లో నిర్వహించిన ఛార్జ్ షీట్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ భావజాలం, బీజేపీ విధానం రిజర్వేషన్లు రద్దు చేయడమేనని అన్నారు. వంద సంవత్సరాల్లో రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆర్ఎస్ఎస్ కంకణం కట్టుకుందని, తమకు మెజార్టీ వస్తే రిజర్వేషన్లు తీసేయడం సులభం అని మోదీ అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ దేశాన్ని మోసం చేశాడు. డబుల్ ఇంజిన్ అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాదు.. అదానీ, ప్రధాని అంటూ రేవంత్ విమర్శించారు.
పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని సీఎం రేవంత్ విమర్శించారు. 20కోట్ల ఉద్యోగాలు ఇస్తానని కేవలం ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. నల్లధనం తెస్తానన్న మోదీ పది పైసలు కూడా తేలేదు. రూ.55 పెట్రోల్ ధర మోదీ వచ్చిన తరువాత రూ.110కి చేరింది. జీఎస్టీ పేరుతో దోపిడీ చేశారంటూ మోదీ ప్రభుత్వంపై రేవంత్ విమర్శలు చేశారు. దేవుడి పేరు చెప్పే బీజేపీ అగరబత్తీలపై కూడా జీఎస్టీ వేశారు. చిన్న పిల్లల పెన్సిల్, రబ్బర్ లపై కూడా జీఎస్టీ వేశారు. 14మంది ప్రధాన మంత్రులు చేసిన అప్పుల కంటే మోదీ ఒక్కరే డబుల్ అప్పులు చేశారంటూ రేవంత్ విమర్శించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు