కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- April 27, 2024
దుబాయ్: కొన్ని నీటి కాలువల్లో చనిపోయిన చేపలు కనిపించడంపై.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై దుబాయ్ మున్సిపాలిటీ స్పందించింది. కుండపోత వర్షం, వరదల తర్వాత నీటి కాలువల్లో చనిపోయిన చేపలు కనిపించడం సహజమైన విషయమని దుబాయ్ మునిసిపాలిటీ (డీఎం) స్పష్టం చేసింది. ఎమిరేట్‌లోని ఫుట్ పాత్, వాటర్ చానల్స్ లలో చనిపోయిన చేపలు ఉన్నాయని అనేక మీడియా మరియు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. తరచుగా వాతావరణ పరిస్థితులలో మార్పుల వల్ల ఇలా అవుతుందని తెలిపారు. అధిక వర్షపాతం పెరగడం లేదా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వంటివి వీటికి కారణం అని ఒక ప్రతినిధి చెప్పారు. పరిస్థితిని నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయని తెలిపారు. యూఏఈ లో ఏప్రిల్ 16న అత్యధిక వర్షపాతం నమోదైంది. అధికారుల ప్రకారం.. దుబాయ్‌లో 24 గంటల కంటే తక్కువ సమయంలో 220 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
తాజా వార్తలు
- ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ
- ఉగ్రవాదం పై రాజీ లేదు: ప్రధాని మోదీ
- కొత్త IT చట్టం రూల్స్
- బూతు రాజకీయాలు, పోలింగ్ బూత్‌లోనే సమాధానం: వెంకయ్య నాయుడు
- 'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- ఒమన్‌లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 11,656 మందిపై బహిష్కరణ వేటు..!!
- డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!









