ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- April 29, 2024
హైదరాబాద్: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం నడుస్తుంది. ఈ క్రమంలో దేశ ప్రజలంతా ఎన్నికల ఫలితాల గురించే మాట్లాడుకుంటున్నారు. కాకపోతే ఏపీ ఎన్నికల గురించి కాస్త ఎక్కువగా ఆరా తీస్తున్నారు. ఈసారి ఏపీలో ఏ పార్టీ విజయం సాదించబోతుందని..ఎవరు విజేత అవుతారని..ఏ పార్టీ కి ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు..? అంటూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ..ఏపీ ఎన్నికల ఫై స్పందించారు.
ఏపీలో జగన్ గెలవబోతున్నట్లు తమకు సమాచారముందని కేసీఆర్, కేటీఆర్‌లు అంటున్నారు. దీనిపై మీ సమాధానం..అని ప్రశ్నించగా..ఎక్కడైనా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉంది. వాళ్లు చెప్పిన మాట నిలబెట్టుకోనందువల్ల ప్రతికూల వాతావరణం ఉంది. మేం షర్మిల నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్ ఇన్నింగ్స్ ప్రారంభించాం. ఎన్ని సీట్లను గెలిపించుకోగలం? షర్మిల ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలపై ఎలా కొట్లాడుతున్నారు? ఆమెకు ఎలా మద్దతుగా నిలబడాలి? అనేదే మా ప్రణాళిక. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనేదే మా రాజకీయ ప్రణాళిక. ఈసారి అక్కడ అన్ని సీట్లలో పోటీకి దిగాం. మా దృష్టంతా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఎన్నికల వాతావరణాన్ని సృష్టించడంపైనే. మొదటి నుండి జగన్ విషయంలో కేసీఆర్ కు సానుకూలంగా ఉంటూ వస్తున్నారు. ప్రతి విషయంలో జగన్ కు సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. అందుకే ఆయన సీఎం జగన్ గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపినట్లు ఉందంటూ రేవంత్ చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..