‘హీరామండి’.! ఆ పాత్రల్లో అందగత్తెల నెక్స్ట్ లెవల్ పర్పామెన్స్.!
- May 02, 2024
1940 స్వాతంత్ర్యానికి సరిగ్గా కొన్ని సంవత్సరాల ముందు హీరామండి ప్రాంతంలోని పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించిన వెబ్ సిరీసే ‘హీరామండి’. లాహోర్‌లో భాగంగా వున్న ఈ ప్రాంతంలో అప్పటి వేశ్యా వృత్తి.. అలాగే స్వాతంత్ర్యం కోసం పోరాడే కొందరు విప్లవ కారులు, నవాబులు, తెల్ల దొరల మధ్య స్నేహం.. సాన్నిహిత్యం.. ఇలా పలు అంశాలను కళ్లకి కట్టినట్లుగా తెరకెక్కించారు ఈ వెబ్ సిరీస్‌లో.
బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ భారీ బడ్జెట్‌తో ఈ వెబ్ సిరీస్‌ని తెరకెక్కించడం దీనిపై ఆసక్తి కలిగించింది. అందుకు తగ్గట్లుగానే ‘హీరామండి’ సిరీస్ వుండడంతో ఓటీటీలో తెగ ట్రెండింగ్ అవుతోందీ సిరీస్.
మనీషా కోయిరాల, సోనాక్షి సిన్హా, అదితీ రావ్ హైదరీ తదితర అందగత్తెలు ఈ సిరీస్‌లో తమదైన పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నారు. వేశ్యల పాత్రల్లో ఆయా హీరోయిన్ల పర్ఫామెన్స్కి ఓటీటీ జనం ఫిదా అవుతున్నారు.
ఎక్కడా వల్గారిటీ లేకుండానే వేశ్యల జీవిత చిత్రాన్ని కళ్లముందుంచిన వైనం నిజంగా ప్రశంసనీయం. అలాగే మరో వైపు స్వాతంత్ర్య ఉద్యమంలో అత్యంత కీలకమైన పార్ట్ అయిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని సైతం తెరపై చాకచక్యంగా ఆవిష్కరించారు సంజయ్ లీలా భన్సాలీ.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







