ఐఎస్, ఎల్ఈటీ కుట్రలు....
- June 08, 2016
భీకర ఉగ్రదాడులతో ప్రపంచానికి సవాల్ విసురుతున్న ఐఎస్ఐఎస్ కన్ను భారత్ పై ఇదివరకే ఉంది. మన ఇంటెలిజెన్స్ బృందాలు ఎక్కడికక్కడ ఐఎస్ ను నిర్వీర్యం చేయడంతో తోకముడిచింది. అయితే ఇప్పుడు మరో గుంటనక్క సాయంతో ఐఎస్ భారత్ లో విధ్వంసం సృష్టించాలనుకుంటోంది. తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్రాలకు జారీచేసిన హెచ్చరికల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు.సిరియా, ఇరాక్ లలో ప్రాబల్యం ఉన్న ఐఎస్.. వివిధ దేశాల్లోని స్థానిక ఉగ్రమూకలతో సంబంధాలు పెట్టుకునే దిశగా ఎప్పటినుంచో పథకాలు రచిస్తోంది. ఆ క్రమంలోనే పాకిస్థాన్ కు చెందిన లష్కరే తాయిబా సంస్థతో టైఅప్ అయింది. 1990ల నుంచి భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోన్న లష్కరే సాయంతో మరిన్ని దాడులు జరపాలని ఐఎస్ భావిస్తున్నట్లు ఐబీ వర్గాలు పేర్కొన్నాయి.ఐఎస్ పథకం రూపొందస్తే, లష్కరే దానిని అమలు చేస్తుందని, వారికి ఆ అవకాశం కల్పించకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను ఐబీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







