కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం

- May 03, 2024 , by Maagulf
కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం

కువైట్: కువైట్‌లో ఈ వారాంతంలో ఒక మోస్తరు వేడి వాతావరణం ఉంటుందని, అలాగే తీర ప్రాంతాలలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. కువైట్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ జనరల్ అబ్దుల్ అజీజ్ అల్-ఖరావి మాట్లాడుతూ.. పగటి ఉష్ణోగ్రతలు 34 - 36 డిగ్రీల మధ్య ఉంటుందన్నారు. సముద్రతీర ప్రాంతాల్లో తేమ మధ్య మధ్యస్థంగా ఉంటుందని, ఉష్ణోగ్రత 19-21 డిగ్రీలకు పడిపోతుందని తెలిపారు. శుక్రవారం వేడిగా మరియు తేమగా ఉంటుంది.ఎందుకంటే వేడి 35-37 డిగ్రీల వద్ద ఉంటుంది. కానీ రాత్రికి ఉష్ణోగ్రతలు 20-22 డిగ్రీల వద్ద స్థిరపడుతుంది. శనివారం అల్-ఖరావి తేమతో పాటు వేడిగా మరియు పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, అయితే వేడి 36 - 28 డిగ్రీల మధ్య కదలాడుతుందని తెలిపారు. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 22 మరియు 24 డిగ్రీల మధ్య ఉంటుందని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com