మరోసారి కారు బాంబు దాడి ; టర్కీ

- June 08, 2016 , by Maagulf
మరోసారి కారు బాంబు దాడి ;  టర్కీ

 టర్కీలో మరోసారి కారు బాంబు దాడి జరిగింది. మార్దిన్‌ ప్రావిన్స్‌లోని సిరియా సరిహద్దు ప్రాంతమైన మిద్యత్‌ పట్టణంలో పోలీస్‌స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు యత్నిస్తున్నారు.
టర్కీలో మంగళవారం కూడా కారు బాంబు దాడి జరిగింది. ఇస్తాంబుల్‌లోని ఓ పోలీస్‌ వాహనంపై జరిగిన దాడిలో 11 మంది మృతిచెందారు. అయితే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఇంతవరకు ఏ సంస్థ ప్రకటన చేయలేదు. ఈ ప్రాంతంలో కుర్దిష్‌ మిలిటెంట్లు తరచుగా పోలీసులు, భద్రతా సిబ్బందిపై దాడులకు పాల్పడుతుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com